Jhunjhunwala: ఒకేరోజు రూ. 800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్​ఝున్‌వాలా!

  • ఇంట్రాడేలో టైటాన్ కంపెనీ షేర్ 5 శాతం పతనం కావడమే ప్రధాన కారణం
  • కంపెనీ షేర్‌ వాల్యూ రూ.16,792 కోట్ల నుంచి రూ.15,986 కోట్లకు దిగ‌జారిన వైనం
  • ఫలితంగా సోమవారం బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ వాల్యూ రూ.3,352.25ల కనిష్ఠ స్థాయికి
Jhunjhunwala loses Rs 800 crore within minutes as Titan shares tank 5 percent

స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరొందిన‌ దివంగత రాకేశ్ ఝున్ ఝున్‌వాలా భార్య రేఖా ఝున్ ఝున్‌వాలా సోమవారం స్టాక్ మార్కెట్లో ఏకంగా రూ. 800 కోట్లు నష్టపోయారు. ఇంట్రాడేలో టైటాన్ కంపెనీ షేర్ 5 శాతం పతనం కావడమే దీనికి ప్రధాన కారణం. టాటా గ్రూప్ నేతృత్వంలోని టైటాన్ కంపెనీలో రేఖకు 2024 మార్చి 31 నాటికి 5.35 శాతం షేర్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపుగా రూ. 16,792 కోట్లు ఉంటుంది. అయితే సోమవారం టైటాన్ కంపెనీ షేర్లు 5 శాతం మేర పతనం అయ్యాయి. 

దీనితో రేఖ స్టాక్స్ వాల్యూ కూడా భారీగా ప‌త‌న‌మై, ఆమె సంపద రూ. 15,986 కోట్లకు దిగజారింది. అంటే ఒక్క రోజులోనే ఆమె ఏకంగా రూ. 805 కోట్లు నష్టపోయారు. ఇక టైటాన్ కంపెనీ ఎం-క్యాప్ విలువ శుక్ర‌వారం రూ. 3,13,868 కోట్లుగా ఉంటే.. సోమ‌వారం ఉద‌యం రూ. 2,98,815 కోట్ల‌కు ప‌డిపోయింది. ఇలా 3 ల‌క్ష‌ల కోట్ల‌కు దిగ‌జార‌డం ఇదే తొలిసారి కూడా.  

ఇక టైటాన్ కంపెనీ ఈ నాలుగో త్రైమాసిక (క్యూ4) ఫలితాల్లో స్టాండ్అలోన్ నెట్ ప్రాఫిట్ 7 శాతం పెరిగి రూ.786 కోట్లకు చేరిందని పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ స్టాండ్అలోన్ నెట్ ప్రాఫిట్ రూ.734 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ ఆదాయాలు అనుకున్నంతగా పెరగలేదు. దీంతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ఫలితంగా సోమవారం నాడు బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ వాల్యూ రూ.3,352.25 కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

  • Loading...

More Telugu News